- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. 4,331 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి, వీటిలో 415 ఏకగ్రీవం కాగా, 3,916 గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ జరగనుంది. 57.22 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేటి సాయంత్రం 6 గంటల నుండి ఎల్లుండి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి.
- Advertisement -



