Friday, December 12, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆరోగ్య సేవల సలహా దినోత్సవంలో పాల్గొన్న లీగల్ సర్వీసెస్ సెల్ జడ్జి 

ఆరోగ్య సేవల సలహా దినోత్సవంలో పాల్గొన్న లీగల్ సర్వీసెస్ సెల్ జడ్జి 

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి జిల్లా న్యాయ సేవా సలహా  అథారిటీ వారిచే ఆరోగ్య సేవల సలహా దినోత్సవ కార్యక్రమం  జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ తరవున అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి జిల్లా లీగల్  సర్వీసెస్  సెల్ జడ్జి   నాగ రాణి  ప్రత్యేక అవగాహన కల్పించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, కామారెడ్డి లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రిలో రోగులకు అవసరమైన సేవలు, వారికి గల హక్కుల గురించి జడ్జి  ఆసుపత్రిలో గల  రోగులకు  విలువైన సమాచారం అందించి వారు నాణ్యమైన ఆరోగ్య సేవలు  పొందేలా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య  ఆరోగ్య శాఖ అధికారి డా.విద్యా రాన్ వల్కర్ , ప్రభుత్వ  జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రవీందర్ గౌడ్ , ఆర్.ఎమ్. ఓ. డా.సంతోష్,  వైద్య సిబ్బంది , రోగులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -