నవతెలంగాణ – మద్నూర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రములో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి ఉషా సంతోష్ మేస్త్రి ఎన్నికల ప్రచారంలో వినూత్న రీతిలో తమ ప్రచారం చేశారు. శనివారం ఆయన సతీసమేతంగా గ్రామంలో తిరుగుతూ.. బీడీ కార్మికుల వద్ద బీడీలు చూడుతూ.. బ్యాట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్తితో గెలిపించాలని మహిళా ఓటర్లను కోరారు. తనను గెలిపిస్తే ప్రభుత్వ పరంగా బీడీ కార్మికులకు అందవలసిన సౌకర్యాలను జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు సహకారంతో అమలయ్యే విధంగా తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా మీకు ఎల్లపుడు అండగా ఉంటానని తెలిపారు. ఉషా సంతోష్ మేస్త్రి ప్రచారం భారీ ఎత్తున కొనసాగుతూ ఆమె గెలుపు కోసం జనాలు జై కొడుతున్నారు.
బీడీలు చుడుతూ ఓట్లు అడిగిన సర్పంచ్ అభ్యర్థి ఉషా-సంతోష్ మేస్త్రి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



