Sunday, December 14, 2025
E-PAPER
Homeమానవిఅస్సలు భయపడొద్దు..

అస్సలు భయపడొద్దు..

- Advertisement -

పియ్రమైన వేణు గీతికకు
నిన్ను చూడబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ కంపెనీ ఫౌండేషన్‌ డేకి రమ్మని చెప్పావు. నేను నాన్న వస్తున్నాము. నీకు కిందటి ఉత్తరంలో డిజిటల్‌ అరెస్ట్‌ గురించి చెప్తానని చెప్పాను కదా! డిజిటల్‌ అరెస్ట్‌ అనేది, ఎదుటి మనిషిని భయభ్రాంతులను చేయడానికి సైబర్‌ నేరగాళ్లు ఉపయోగిస్తున్న పదం. నీకు వివరంగా చెప్తాను.
ఇటీవల చాలా మంది సైబర్‌ మోసగాళ్ల వల్ల ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. ఇది నిజమైన చట్టపరమైన అరెస్ట్‌ కాదు. ఇది పూర్తిగా స్కాం/మోసం. సైబర్‌ నేరగాళ్లు ఏమి చేస్తారంటే..
ఫోన్‌ కాల్‌/వీడియో కాల్‌ చేస్తారు. వారు పోలీస్‌, జదీ×, =దీ×, ఖీవసజుఞ, జybవతీ జవశ్రీశ్రీ లా నటిస్తారు. మనం భయపడే విధంగా మాటలు చెబుతారు. ‘మీ ఆధార్‌తో క్రైమ్‌ జరిగింది. మీ పాకెట్‌లో డ్రగ్స్‌ దొరికాయి. మీ బ్యాంక్‌ అకౌంట్‌ ఫ్రీజ్‌ అవుతుంది’ అంటారు. మీ వీడియో కాల్‌ ఓపెన్‌ చేయమని అంటారు. మీరు ఎక్కడికీ వెళ్లకుండా స్క్రీన్‌ ముందు కూర్చోవాలంటారు. ఇదే వారు ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అంటారు. చివరికి పేమెంట్‌/ఫైన్‌/సెక్యూరిటీ డిపాజిట్‌ పేరుతో డబ్బులు అడుగుతారు. ఇది పూర్తిగా నకిలీ. పోలీసులు ఇలాంటి డిజిటల్‌ అరెస్ట్‌ చేయరు. భారతీయ చట్టంలో డిజిటల్‌ అరెస్ట్‌ అనే పదం లేదు. వాట్సాప్‌/వీడియో కాల్‌ ద్వారా అరెస్ట్‌ చేయరు. డబ్బులు అడగరు.
డిజిటల్‌ అరెస్ట్‌ కాల్‌ వస్తే చేయాల్సింది ఏమిటంటే వెంటనే కట్‌ చేయడం. డబ్బు పంపకుండా ఉండటం. ఎలాంటి వివరాలు (ఓటీపీ, బ్యాంక్‌, ఆధార్‌) ఇవ్వకుండా ఉండాలి. స్క్రీన్‌షేర్‌, వీడియోకాల్‌ అసలు చేయొద్దు. ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి ఏమిటంటే వారు భయ పెట్టినా భయపడి పోకూడదు. ప్రతిదీ క్రాస్‌ చెక్‌ చేసుకోవాలి. మొన్న పేపర్‌లో చూసాను ‘నీటి బిల్లు మీరు ఎప్పటి నుంచో కట్టలేదు, చాలా పెండింగ్‌ ఉంది. ఇన్ని లక్షలు కట్టాలి’ అనగానే అతను వివరాలు కనుక్కోకుండా వాళ్ళు చెప్పిన అకౌంట్‌కి డబ్బులు పంపారు. ఆ తర్వాత ఫోన్‌ చేస్తే స్విచ్చాఫ్‌ వస్తోందట. నీటి బిల్లు అన్ని లక్షలు ఎందుకు వస్తుందని ఆలోచించాలి కదా! వివరాలు కనుక్కోవాలి. ఒక వేళ బిల్లు కట్టక పోయినా, మునిగి పోయేది ఏముంది, ఫోన్‌ చేసింది ఎవరో కనుక్కుని కట్టేస్తే సరిపోయేది. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మోసపోతూనే ఉన్నారు. సరే ఉంటాను. మిగతా విషయాలు కలిసినప్పుడు మాట్లాడుకుందాం. మేము కూడా మీ కంపెనీ సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉంది.
ప్రేమతో మీ అమ్మ
హొ- పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -