Sunday, December 14, 2025
E-PAPER
Homeతాజా వార్తలుమీరు అనుకున్నది కాదు..

మీరు అనుకున్నది కాదు..

- Advertisement -

తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘మ్యాజిక్‌ మూవ్‌మెంట్స్‌’ (మీరు అనుకున్నది కాదు). దర్శకుడు కె.దశరథ్‌ సమర్పకులు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్‌, శ్రీ లక్ష్మి శ్రీనివాస ఫిలిమ్స్‌ బ్యానర్స్‌ పై తల్లాడ శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. వెంకట్‌ దుగ్గిరెడ్డి సహ నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ సినిమా టైటిల్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. సహ నిర్మాత వెంకట్‌ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ,’నేనూ ఈ చిత్రంలో ఒక మంచి రోల్‌ చేశాను. ఈ సినిమా హిట్‌ అయి సాయికృష్ణ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవడంతో పాటు జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

హీరో, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ, ‘ఈ చిత్రాన్ని హీరోగా నటిస్తూ రూపొందిస్తున్నా. మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌తో పాటు డివోషనల్‌ టచ్‌ కూడా ఉంటుంది. సాయిబాబా ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభం కావడం.. అందరూ ఈ సినిమాకి సహకరించడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు. సమర్పకులు దశరథ్‌ మాట్లాడుతూ,’మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా ఇది సరి కొత్తగా ఉండే చిత్రం. సాయికృష్ణకు నా వంతు సపోర్ట్‌ అందించాలనే చిత్ర సమర్పణకు ముందు కొచ్చాను’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -