Sunday, December 14, 2025
E-PAPER
Homeసోపతినవ్వుల్‌ పువ్వుల్‌

నవ్వుల్‌ పువ్వుల్‌

- Advertisement -

భలే మొగుడు

అప్పటిదాకా ఊరిమీద బలాదూర్‌ తిరిగొచ్చిన శ్యామలరావు భార్యతో ”కాంతం, ఈ రోజు లంచ్‌లోకి ఏం చేశావ్‌?” అనడిగాడు
ఆ మాటలకి బట్టలు వుతుకుతున్న కాంతానికి కోపం నషాళానికి అంటింది. ”ఇవ్వాళ్టికి ఊరు వెళ్ళాననుకుని మీరే వంట చేసుకుని తినండి” అంది.
దాంతో లుంగీ ఎగ్గట్టి వంటింట్లోకి వెళ్ళి వండుకుని కడుపునిండా తిని బయటికి వచ్చాడు.
ఇంటి పని పూర్తిచేసుకుని వచ్చిన కాంతం వండిన గిన్నెలు చూసి ”మరి నాకోసం వుంచలేదేంటి?” అనడిగింది.
”నువ్వు ఊర్నుండి ఎప్పుడొచ్చావ్‌ కాంతం?” అడిగాడు అమాయకమైన మొహం పెట్టి శ్యామలరావు

అంత సంతోషమా?

సిరి : ఇవ్వాళ మా ఆయన పుట్టిన రోజు. బాగా సంతోషపడేట్లు ఏదైనా గిఫ్ట్‌ ఇవ్వాలి.
సత్య : ఓ పని చెయ్యి. విడాకులు ఇచ్చెరు.
సిరి : మరీ అంత సంతోషం తట్టుకోలేక ఏమైపోతాడోనని భయంగా వుంది. ఇంకేదైనా చెప్పవే.

నవ్వినా తప్పేనా?

భార్య : నిన్న రాత్రి మీరు మళ్ళీ తాగొచ్చారు కదా?
భర్త : లేదే! నేను నిన్న తాగనేలేదు.
భార్య : అబ్బో.. అవునా రాత్రంతా టీవీ చూస్తూ ఒకటే నవ్వుతున్నారుగా.
భర్త : టీవీ చూస్తూ నవ్వితే తాగినట్లా?
భార్య : స్విచ్‌ ఆపి వున్న టీవీ చూస్తూ నవ్వుతున్నారు మరి!

తోడు

భర్త : పక్కింటి ఆవిడకి తోడు కావాలంట. నేను వెళ్తున్నా. ఇకపై పిల్లల్ని, ఇంటిని నువ్వే చూసుకోవాలి. జాగ్రత్త.
భార్య : వీపు విమానం మోత మోగుద్ది. ఆవిడ తోడు అడిగింది పాలలోకి.

ఎంజారు మెంట్‌ రావడం లేదండి

సుమ: ఏవండోరు… వెంటనే మీరు వచ్చి నన్ను తీసుకుని వెళ్లండి అంది భర్తతో
రాజు: ఎందుకోరు… పుట్టింటికి వెళ్లావు కదా మరో వారం రోజులు వుండి హ్యాపీగా ఎంజారు చేసి రావచ్చు కదా.
సుమ: వద్దండీ. ఇక్కడ నాకు బోర్‌ కొడుతోంది. అన్నా, వదిన, చెల్లి, అమ్మా, నాన్నలతో గొడవ పడ్డాను. అదేంటో గానీ మీతో గొడవ పడినప్పుడు వున్న ఎంజారు మెంట్‌ వీళ్లతో రావడం లేదండీ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -