లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (LOC) కేవలం అమెరికా దేశానికే కాక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జ్ఞాన పరిశోధన సమాజానికి ఒక ప్రధాన వనరుగా, నిధిగా నిలుస్తుంది. ఇది అమెరికా రాజధాని వాషింగ్టన్, డి.సి.లో ఉంది. సుమారు 178మిలియన్ డాలర్లకు పైగా పత్రాలు, పుస్తకాలు, సినిమాలు, శబ్ద రికార్డింగ్లు, ఫొటోలు, పత్రికలు, పటాలను కలిగి ఉన్న ఈ గ్రంథాలయం ‘ప్రపంచంలోనే అతిపెద్ద గ్రంథాలయం’గా ప్రసిద్ధి చెందింది. ఈ అపారమైన సేకరణలు 470కు పైగా భాషల్లో అందుబాటులో ఉన్నాయి. తద్వారా ఇది మానవ సజనాత్మకతకు, జ్ఞాన వారసత్వానికి విశాలమైన, విభిన్నమైన, సమగ్రమైన కేంద్రాన్ని సష్టిస్తుంది.
LOC కేవలం ఒక గ్రంథాలయం మాత్రమే కాదు. ఇది అమెరికా చట్టసభకు, ‘యు.ఎస్. కాంగ్రెస్’కు కీలకమైన పరిశోధన, మద్దతు విభాగానికి ప్రధాన అనుబంధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా, అమెరికా కాపీరైట్ కార్యాలయం కూడా ఈ లైబ్రరీలోనే ఉంది. ఈ రెండింతల పాత్ర (పరిశోధన కేంద్రం, సాంస్కతిక సంరక్షణ కేంద్రం)LOC బ్రిటిష్ లైబ్రరీ లేదా బిబ్లియోథెక్ నేషనల్ డి ఫ్రాన్స్ వంటి ఇతర జాతీయ గ్రంథాలయాల నుండి ప్రత్యేకంగా నిలబెడుతుంది. కొత్త పాఠకుల నుంచి అనుభవజ్ఞులైన పరిశోధకుల వరకు, అందరికీ అత్యున్నత ప్రమాణాల సహకారం, సమాచారాన్ని అందించడానికి లైబ్రరీ సిబ్బంది ఆన్లైన్లో, ప్రత్యక్షంగా అందుబాటులో ఉంటారు. ఈ విధంగా, ూఉజ జ్ఞానం, ప్రజాస్వామ్య విలువలకు కేంద్ర బిందువుగా పనిచేస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పండితులు, కళాకారులు, శాస్త్రవేత్తలకు నిరంతరం ప్రేరణను, సమాచారాన్ని అందిస్తుంది.
2025 అక్టోబరు మూసివేత: మూడు మలుపుల సంక్షోభంబీ 2025 అక్టోబరు నెల ప్రారంభంలో లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ తాత్కాలికంగా మూసివేయబడటం అనేది అమెరికా ప్రభుత్వం ఎదుర్కొన్న లిలిబడ్జెట్ సంక్షోభం, తీవ్రమైన నిధుల కోతలు, మరియు పరిపాలనాపరమైన రాజకీయ జోక్యం అనే మూడు ప్రధాన సమస్యల మిళిత రూపాన్ని ప్రతిబింబించింది. ఈ మూసివేత ూఉజ ప్రస్తుత భౌతిక కార్యాచరణ వైఫల్యానికి సంకేతం కాదు. కానీ కేవలం నిధుల లేమి వల్ల సంభవించిన తాత్కాలిక విఘాతం మాత్రమే. ఇది ూఉజ చరిత్రలో చీకటి రోజుగా పరిగణించబడింది, ఇది గ్రంథాలయం భవిష్యత్తు స్థిరత్వంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది.
తాత్కాలిక మూసివేత: బడ్జెట్ ప్రతిష్టంభన ఫలితం నూతన ఆర్థిక సంవత్సరం (ఖ్‌ీ 2026) నిధులు 2025 సెప్టెంబర్ 30 తో ముగియగా, వాటిని సకాలంలో ఆమోదించడంలో అమెరికా కాంగ్రెస్ విఫలమైంది. దాంతో, అక్టోబర్ 1 2025 నుండి ఫెడరల్ ప్రభుత్వం తాత్కాలికంగా మూసివేయబడింది. ఈ పరిణామం ూఉజని కూడా ప్రభావితం చేసింది. ఇది తర్వాత పూర్తిగా మూసివేయడంతో దైనందిన కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ప్రజా సేవల నిలుపుదల: లైబ్రరీలోని థామస్ జెఫర్సన్ భవనం (1897), జాన్ ఆడమ్స్ బిల్డింగ్ (1938), మరియు జేమ్స్ మాడిసన్ స్మారక భవనం (1981)లలోని పరిశోధక మరియు పఠన సౌకర్యాలు మూసివేయబడ్డాయి. సాధారణ పాఠకులు, పరిశోధకులు ఉపయోగించే అన్ని సేవలు నిలిచిపోయాయి. కేవలం కాంగ్రెస్ సభ్యులు, వారి సిబ్బంది మాత్రమే అత్యవసర పత్రాలు, సమాచారాన్ని కోరడానికి పరిమిత ప్రాప్యతతో ఉన్నారు. ఎందుకంటే ూఉజ ప్రాథమిక పాత్ర చట్టసభకు మద్దతు ఇవ్వడం.
ఆన్లైన్ పరిమితులు: ప్రభుత్వ మూసివేత సమయంలో గ్రంథాలయ ఆన్‌లైన్ సేవల్లో కూడా నిరోధాలు ఏర్పడ్డాయి. చట్టసభ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన కీలకమైన వెబ్‌సైట్ Congress.gov కాపీరైట్ నమోదుల కోసం ఉన్న Congress.gov మాత్రం నిరంతరంగా కొనసాగించబడ్డాయి. అయితే, లైబ్రరీ ప్రధాన వెబ్సైట్ loc.gov నవీకరణలు నిలిచిపోయాయి. చాలా మంది సిబ్బంది తమ ఇమెయిల్ లేదా అధికారిక సంబంధాల యాక్సెస్‌ను కోల్పోయారు. ఈ పరిమితులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులను, సజనాత్మక వర్గాన్ని ఇబ్బంది పెట్టాయి.
లితాత్కాలిక ఉపశమనం: కాంగ్రెస్ సెప్టెంబర్ చివర్లో అత్యవసరంగా ‘కంటిన్యూయింగ్ రిజల్యూషన్ ‘ అనే తాత్కాలిక వ్యయ బిల్లును ఆమోదించి పరిస్థితిని కొంతవరకు సర్దుబాటు చేసింది. ఈ బిల్లు ద్వారా నవంబర్ 21, 2025 వరకు ప్రభుత్వ కార్యాలయాలకు తాత్కాలికంగా నిధులు అందించబడ్డాయి. ఈ నిర్ణయం తర్వాత లైబ్రరీ మళ్లీ తెరుచుకుని సాధారణ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించింది. అయినప్పటికీ, నవంబర్ తర్వాత ప్రభుత్వం దీర్ఘకాలిక బడ్జెట్ పరిష్కారం తీసుకొచ్చే అవసరం కొనసాగుతూనే ఉంది. మరొక మూసివేత ప్రమాదం తొలగిపోలేదు.
దీర్ఘకాలిక ఆర్థిక సవాళ్లు: బడ్జెట్ కోతల ప్రభావం, మూసివేత కంటే ముందు నుంచే ూఉజ దీర్ఘకాలిక నిధుల అభద్రతను ఎదుర్కొంటోంది. 2023 ఆర్థిక సంవత్సరంలో లైబ్రరీ వార్షిక కార్యకలాపాల బడ్జెట్ సుమారు 875 మిలియన్లుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ బడ్జెట్లపై అనిశ్చితి నెలకొంది.
భారీ బడ్జెట్ కోతలు: జూన్ 2025లో, హౌస్ అప్రోప్రియేషన్స్ సబ్కమిటీ 2026 కోసం ూఉజ బడ్జెట్లో 84.5 మిలియన్ డాలర్ల కోతను ప్రతిపాదించింది. మొత్తం 767.6 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను మాత్రమే కేటాయించాలనే సూచనతో, ఇది 2025 నిధుల కంటే గణనీయంగా తక్కువ. ముఖ్యంగా, సాలరీస్ అండ్ ఎక్స్పెన్సెస్ ఫండ్లో ఏకంగా 90.5 మిలియన్ డాలర్ల తగ్గింపు సూచించబడింది. 3,238 మంది సిబ్బంది ఉన్న ూఉజలో ఈ కోతలు ఉద్యోగ భద్రత, సేవల నాణ్యతపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి.
సేకరణల పరిరక్షణపై ఆందోళన: నిధుల కోతల వలన, 470 భాషల్లో ఉన్న 170 మిలియన్లకు పైగా అరుదైన గ్రంథాలు, మాన్యుస్క్రిప్టులు, చట్టపరమైన పత్రాలు, సంగీత నోట్స్, మ్యాపులు, చిత్రాలు, ధ్వని రికార్డులు వంటి వస్తువుల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియపై ఒత్తిడి పెరిగింది. ూఉజ ప్రతి సంవత్సరం 681,000కు పైగా రిఫరెన్స్ అభ్యర్థనలు పరిష్కరిస్తుంది. కాబట్టి ఈ సేవలను కొనసాగించడానికి స్థిరమైన నిధులు అవసరం.
ఎంపిక చేసిన పెంపు: కాన్గ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ దష్టి లోపం ఉన్న పాఠకుల కోసం లిలినేషనల్ లైబ్రరీ సర్వీస్ (చీూూ) వంటి కొన్ని కీలక విభాగాలకు స్వల్ప నిధుల పెంపును సూచించినప్పటికీ, లైబ్రరీ ప్రధాన ఖర్చుల విభాగాల్లోని కోతలకు ఇవి సరితూగవు. ఉదాహరణకు, దష్టి లోపం ఉన్న వారికి 24.5 మిలియన్ బ్రెయిల్, ఆడియో, పెద్ద అక్షరాల పుస్తకాలను పంపే చీూూ కార్యక్రమం నిధుల స్థిరత్వంపై ఆధారపడి ఉంటుంది.
పరిపాలనాపరమైన అనిశ్చితి: రాజకీయ జోక్యం: నిధుల సంక్షోభంతో పాటు, పరిపాలనా స్వతంత్రతపై రాజకీయ జోక్యం లైబ్రరీలో మరింత అనిశ్చితిని సష్టించింది.LOC స్థిరమైన, నిష్పాక్షికమైన నిర్వహణ దాని ప్రాథమిక లక్ష్యాలకు అత్యంత కీలకం.
లైబ్రేరియన్ తొలగింపు: మే 2025లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డా. కార్లా హెడెన్ను తొలగించి, న్యాయ విభాగ అధికారిని తాత్కాలిక లైబ్రేరియన్‌గా నియమించారు. ఈ చర్య, స్థిరమైన లైబ్రేరియన్ ఆఫ్ కాంగ్రెస నియామకం జరగకపోవడం వలన, సంస్థాగత స్వతంత్రతపై పర్యవేక్షణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి.
స్థిరత్వం లేమి: పరిపాలనాపరమైన అనిశ్చితి, స్థిరమైన నాయకత్వం లేకపోవడం వలన,LOC విధానపరమైన నిర్ణయాలపై రాజకీయ ప్రభావం పెరిగే ప్రమాదాన్ని సూచించింది. లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ చట్టసభకు నిష్పాక్షికమైన, విధానపరమైన సమాచారాన్ని అందించే కేంద్రం. కాబట్టి దాని స్వతంత్రత దెబ్బతినడం కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ విశ్వసనీయతపై కూడా ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ప్రాముఖ్యత, భవిష్యత్ సవాళ్లు
లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ కేవలం పుస్తకాలతో కూడిన భవనం మాత్రమే కాదు, ఇది అమెరికా ప్రజాస్వామ్యానికి, జ్ఞాన వారసత్వానికి, సమాచార స్వేచ్ఛకు ప్రతీక. దాని ప్రాముఖ్యత ఈ క్రింది మూడు అంశాలలో స్పష్టమవుతుంది: చట్టసభకు ప్రధాన పరిశోధనా కేంద్రం: ూఉజలోని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (జ=ూ), చట్టసభ సభ్యులకు బిల్లులను రూపొందించడానికి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి, సంక్లిష్ట సమస్యలను అర్థం చేసుకోవడానికి నిష్పాక్షికమైన, అధికారిక విశ్లేషణ, సమాచారాన్ని అందిస్తుంది. ఈ రకమైన ప్రత్యక్ష శాసన మద్దతు ప్రపంచంలోని ఇతర జాతీయ గ్రంథాలయాలలో చాలా అరుదు.
ప్రపంచంలోనే అతిపెద్ద జ్ఞాన భాండాగారం: 170 మిలియన్లకు పైగా వస్తువులను 25.7 మిలియన్ వర్గీకత పుస్తకాలు, 78.5 మిలియన్ మాన్యుస్క్రిప్టులు, 15.7 మిలియన్ ఫొటోలు, 8.2 మిలియన్ సంగీత పత్రాలు వంటివి 470కు పైగా భాషలలో కలిగి ఉన్న ఈ లైబ్రరీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులకు ముఖ్యమైన వనరుగా నిలుస్తుంది.
కాపీరైట్ కేంద్రం:LOC లిలియు.ఎస్. కాపీరైట్ ఆఫీస్ను నిర్వహిస్తుంది. ఇది దేశ కాపీరైట్ చట్టాలను అమలు చేసి, కళాత్మక, సజనాత్మక రచనలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో 441,500వి కాపీరైట్ నమోదులు చేసింది.
2025 అక్టోబరు మూసివేతLOC చరిత్రలో ఒక తాత్కాలిక విఘాతం మాత్రమే. అయినప్పటికీ, ఇది దీర్ఘకాలికంగా నిధుల స్థిరత్వం, సంస్థాగత స్వతంత్రత, రాజకీయ జోక్యం లేకపోవడం వంటి అంశాలు గ్రంథాలయ భవిష్యత్తుకు కీలకమైన సవాళ్లుగా నిలుస్తున్నాయని స్పష్టం చేసింది. కాంగ్రెస్ దీర్ఘకాలిక బడ్జెట్ ఒప్పందాన్ని సాధించడంలో విఫలమైతే, నవంబర్ 21 తర్వాత మళ్లీ మూసివేత ఏర్పడే ప్రమాదం ూఉజతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పరిశోధన, విద్య, సమాచార వనరుల పరిరక్షణకు సవాలుగా ఉంటుంది. స్థిరమైన మద్దతు లభిస్తేనే, లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ ప్రపంచ జ్ఞాన వారసత్వంలో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకోగలదు.
– డా|| రవికుమార్ చేగొని, 9866928327



