నేటి తరం యువత మానసిక, సామాజిక అంశాలను, ముఖ్యంగా అమ్మాయిలు తమ జీవితంలో ఎదుర్కొనే సంక్లిష్ట ప్రశ్నలకు ఈ చిత్రం ఒక నిశితమైన అద్దం పట్టింది. ఇది కేవలం లవ్ స్టోరీ కాదు, ఇది ఒక ‘ఎమోషన్-ఎడ్యుకేషన్’ పాఠం.
చిన్నప్పటి నుండి ఆడపిల్లలకు ఇచ్చే ‘సైలెంట్ కండిషనింగ్’ (అణగి ఉండటం) ను ఈ సినిమా ప్రశ్నించింది. తన భద్రత, ఆత్మగౌరవం, హక్కుల విషయంలో ఒక అమ్మాయి తప్పకుండా మాట్లాడాలి.
అసెర్టివ్ కమ్యూనికేషన్ (Assertive Communication): ఇతరుల గౌరవాన్ని భంగం చేయకుండా, తన అభిప్రాయాలను, అవసరాలను స్పష్టంగా చెప్పగల నైపుణ్యం.
హీరోయిన్ మొదట స్వీయ సందేహం Self Doubt తో బాధపడి, చివరకు స్వీయ విలువ Self Worth) ను గుర్తించి, ధైర్యంగా స్వీయ వ్యక్తీకరణ (Self Expression)వైపు అడుగులేయడం నేటి ప్రతి యువతికి స్ఫూర్తి.
తండ్రి-కూతురు బంధం: కంట్రోల్ కాదు… కనెక్షన్ కావాలి! : ఒక అమ్మాయి జీవితంలో ఆమె తండ్రి పాత్ర అత్యంత కీలకం. ఈ చిత్రంలో చెప్పిన సత్యం. ఒక కూతురు తన తండ్రితో ఏ సమస్యనైనా పంచుకోగలిగితే, ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళగలదు.
”ªFather’s emotional connection decides daughter’s self-respect level in future relationships. ”
తండ్రి ప్రేమ, వినే తత్వం, అర్థం చేసుకునే గుణం… ఇవే కూతురికి భవిష్యత్తులో ఏర్పడే ‘టాక్సిక్ రిలేషన్‌షిప్స్’ Toxic Relationships కు లొంగకుండా నిలబడటానికి బలాన్ని ఇస్తాయి. తండ్రి కేవలం కంట్రోల్ చేసేవాడిగా కాకుండా, కనెక్ట్ అయ్యేవాడిగా ఉండాలి.
కుటుంబ ప్రభావం: ‘లేర్న్డ్ బిహేవియర్’ ప్రమాదం : కుటుంబంలో భార్యను అవమానించినప్పుడు, కొడుకు స్పందించకపోతే, అది అతని భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
తల్లి మౌనాన్ని కొడుకు బలహీనతగా చూస్తాడు, సహనంగా కాదు. అది సహజం, గొప్పదనం అనుకుంటాడు. ఫలితం… అతను మానసికంగా అపరిపక్వంగా (Emotionally Immature), సంబంధాల పట్ల సున్నితత్వం లేనివాడిగా (Relationship Insensitive) పెరుగుతాడు. తాను అనుకున్నదే, చెప్పేదే కరెక్టే అనేలా పెరుగుతారు. తాను చూసిన అదే అసమతుల్య మోడల్‌ను భవిష్యత్తులో తన భార్యపై కూడా రుద్దడానికి ప్రయత్నిస్తాడు. కుటుంబంలో గౌరవం ఉంటేనే, పిల్లలు ఆరోగ్యకరమైన సంబంధాలను నేర్చుకుంటారు.
4. సహాయక వ్యవస్థ : రక్షణ కవచం
ఒక అమ్మాయికి సరైన స్నేహితులు, గురువులు ఉన్నప్పుడు, ఆమె ఏ సమస్య నుంచైనా సులభంగా బయటపడగలదు. ఎమోషనల్ మానిప్యులేషన్‌కు వ్యతిరేకంగా రక్షణ కారకాలు (Protective Factors against Emotional Manipulation). మంచి స్నేహితులు, ప్రొఫెసర్‌లు ఆమె ఆలోచనలను పదును పెడతారు, భయాన్ని తగ్గిస్తారు, ఆమెకు నిజాన్ని గుర్తించే కళ్ళుగా నిలుస్తారు.
సినిమా చెప్పిన అతిపెద్ద సందేశం : ”ప్రేమలో మాటలు, బహుమతుల కంటే విలువైనది గౌరవం . ఈ సినిమా ప్రేమ, సరిహద్దులు, టాక్సిక్ సంబంధాలను గుర్తించడం, గౌరవం లేని ప్రేమ ఎందుకు ప్రమాదకరమో అనే విషయాలను అందంగా చూపించింది. మాట్లాడే హక్కు, ‘చీఉ’ చెప్పే స్వేచ్ఛ, తనకోసం నిలబడే ధైర్యం – ఈ మూడు అంశాలే నేటి యువతికి అత్యవసరం.
‘గాళ్ ఫ్రెండ్’ కేవలం వినోదం కాదు, ఇది ఒక సొసైటీ ట్రైనింగ్ క్లాస్. ప్రతి కుటుంబం, యువకుడు, యువతి చూడాల్సిన ఒక సామాజిక శిక్షణా తరగతి. భావోద్వేగం, ఆలోచన కలిసి నడిచే ప్రేమే ఆరోగ్యకరమైన ప్రేమ. అమ్మాయిలు తిరగబడితే… ప్రేమ అంటే ఏమిటి? ఎక్కడ ఆగిపోవాలి (Boundary)? ప్రేమను (Toxic Love) ఎలా గుర్తించాలి? అనేవి ఈ సినిమా నేర్పిస్తుంది.
అత్యంత సున్నితమైన, సునిశితంగా తీసిన డైరెక్టర్‌కి ప్రత్యేక శుభాకాంక్షలు.
డా|| హిప్నో పద్మా కమలాకర్, 9390044031
కౌన్సెలింగ్, సైకో థెరపిస్ట్, హిప్నో థెరపిస్ట్



