Sunday, December 14, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంట్రంప్‌నకు ఆ అధికారం లేదు !

ట్రంప్‌నకు ఆ అధికారం లేదు !

- Advertisement -

హెచ్‌-1బీ వీసా ఫీజును సవాలు చేసిన 20 రాష్ట్రాలు

వాషింగ్టన్‌ : అత్యంత నైపుణ్యాలు కలిగిన విదేశీ వర్కర్లకు కొత్తగా హెచ్‌-1బీ వీసాలు కావాలంటే లక్ష డాలర్లు చెల్లించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకువచ్చిన విధానాన్ని నిషేధించాలని ఆ దేశంలోని పలు రాష్ట్రాలు సవాలు చేశాయి. ఇందులో కాలిఫోర్నియా, మరో 19 రాష్ట్రాలు శుక్రవారం కేసు దాఖలు చేశాయి. బోస్టన్‌లోని ఫెడరల్‌ కోర్టులో దాఖలైన కేసు మూడవది. కాలిఫోర్నియాతో పాటు న్యూయార్క్‌, మసాచుసెట్స్‌, ఇల్లినాయిస్‌, న్యూజెర్సీ, వాషింగ్టన్‌ రాష్ట్రాలు ఈ విధానాన్ని సవాలు చేశాయి. ప్రస్తుతం ఈ వీసా కోసం యజమానులు 2వేల నుంచి 5వేల డాలర్ల వరకు చెల్లిస్తున్నారు. ఫీజును విధించడానికి ట్రంప్‌నకు అధికారం లేదని కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌ రాబ్‌ బాంటా కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొన్నది. వీసాకు అయ్యే అవసరమైన ఖర్చు కోసమే ఫీజు వసూలు చేయడానికి ఇమ్మిగ్రేషన్‌ అధికారులకు అనుమతి ఉందనీ, అలా కాకుండా ఇంత పెద్ద మొత్తంలో ఫీజు వసూలు చేయడం ఫెడరల్‌ చట్టాన్ని ఉల్లంఘిస్తుందని వివరించింది. కాగా కొత్త ఫీజు చట్టబద్ధమైన ప్రక్రియ అని వైట్‌హౌస్‌ పేర్కొన్నది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -