Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకార్మికుల వేతనాలు పెంచాలి

కార్మికుల వేతనాలు పెంచాలి

- Advertisement -

ఆరు రోజులుగా తీవ్రచలిలో మహిళా కార్మికుల సమ్మె
చలించని యాజమాన్యం
సీఎం రేవంత్‌రెడ్డికి సీఐటీయూ లేఖ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
మేడ్చల్‌ జిల్లా నాచారం పారిశ్రామిక ప్రాంతం లోని షాహి ఎక్స్‌పోర్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రాములు, పాలడుగు భాస్కర్‌ కోరారు. శనివారం ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. మహిళా కార్మికులు ఆరు రోజులుగా రోడ్డుపై బైటాయించి రాత్రింబవళ్లు చలి లో, ఎండలో సమ్మె చేస్తున్నా యాజమాన్యం చలించడం లేదని పేర్కొన్నారు. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని వేతనాలు పెంచేలా చర్యలు తీసుకో వాలని విజ్ఞప్తి చేశారు. నాచారం పారిశ్రామిక ప్రాంతంలోని షాహి ఎక్స్‌పోర్ట్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో సుమారు 1,600 మంది మహిళా కార్మికులు 17ఏండ్లుగా పని చేస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలనీ, యాజమాన్యాల వేధింపులు ఆపాలనీ, క్యాంటిన్‌ సౌకర్యం కల్పించాలనీ, కార్మిక చట్టాలు అమలు చేయాలని పరి శ్రమ ముందు బైటాయించి కార్మికులు సమ్మె చేస్తున్నట్టు పేర్కొన్నారు. సమ్మె లో ఉన్న మహిళా కార్మికులను యాజమాన్యం భయబ్రాంతులకు గురిచేస్తున్నదని తెలిపారు.

న్యాయమైన సమస్యను ప్రజాస్వామ్య యుతంగా పరిష్కరిం చకుండా తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళా కార్మికుల శ్రమను యాజమాన్యం దోచుకుంటున్నదని విమర్శించారు. పనిలో టార్గెట్టు పెడుతున్నారనీ, టార్గెట్టు పూర్తి చేయని కార్మికుల వేతనాల్లో కోతలు పెడుతున్నారని పేర్కొన్నారు. భోజన విరామం, విశ్రాంతి, టారులెట్‌కు వెళ్లే సమయాన్ని కూడా కుదిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించా లని నిలదీసిన మహిళా కార్మికులను తొలగిస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. వీరికి నామమాత్రంగా రూ. 9 వేల నుంచి రూ.11,200 వరకు మాత్రమే వేతనం ఇస్తున్నారని తెలిపారు. ఒక రోజు సెలవు పెడితే వేతనం నుంచి రూ.ఏడు వందల నుంచి రూ.ఎనిమిది వందల వరకు కట్‌ చేస్తున్నా రని పేర్కొన్నారు. శనివారం సెలవు పెడితే ఆదివారం కూడా వేతనంలో కట్‌ చేస్తున్నారని వారు తెలిపారు. ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకుని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -