షబ్బీర్‌అలీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ అన్నారు. ఇండియన్ క్రిస్టియన్ జర్నలిస్ట్స్ కలెక్టివ్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సీఎస్‌ఐ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలోని ఆడిటోరియంలో సెమీ క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రిస్టమస్ సందర్భంగా చర్చీల మరమ్మతులు, నిర్మాణాల కోసం ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని చెప్పారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా కేటాయించిన నిధుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఇండిపెండెంట్ చర్చీలు సౌకర్యాల లేమితో ఉన్నాయని అన్నారు. వాటిని మొదటి ప్రాధాన్యతనివ్వాలని అధికారులకు సూచించామన్నారు. పాస్టర్లు ఆర్థికంగా ఇబ్బందుల్లో వారికి నెలకు రూ.రెండు వేల ఆర్థిక సాయం ఇస్తామంటూ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం ఏడు వేల మందికి అందిస్తున్నామని వివరించారు.
సుమారు 20 వేల మంది పాస్టర్లున్నారనీ, రిజిస్ట్రేషన్‌లో సమస్య వల్ల అడ్డంకులు ఎదురవుతున్నాయని అన్నారు. క్రైస్తవుల మీద మతోన్మాదులు దాడులు చేస్తున్నా రనీ, ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో జర్నలిస్టులు ప్రభు త్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీకి సూచనలివ్వాలని కోరారు. క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్ జాన్ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చర్చీల నిర్మాణాలు, శ్మశాన వాటికల మరమ్మతుల కోసం సుమారు రూ.130 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, పాస్టర్లు పురుషోత్తం, సుశీల్ విక్టర్, తెలంగాణ మైనార్టీ కమిషన్ వైస్ చైర్మెన్ శంకర్ లూక్, ప్రభుత్వ మాజీ ముఖ్యకార్యదర్శి మిన్ని మ్యాథ్యూ, మాజీ డీజీపీలు స్వరణ్‌జిత్‌సేన్, బాబురావు, మాజీ అదనపు డీజీ డీటీ నాయక్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండీ సబిత, ప్రొఫెసర్ స్టీవెన్‌సన్, హిందూ రెసిడెంట్ ఎడిటర్ రవిరెడ్డి, సీనియర్ జర్నలిస్టులు జాన్, శశిధర్, సుశీల్‌రావు జోనా, రామారావు, జాషువ శ్యాంసన్, జోయల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రిస్టియన్ మైనార్టీల సంక్షేమానికి కృషి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



