Sunday, December 14, 2025
E-PAPER
Homeరాష్ట్రీయండ్రగ్స్‌, గంజాయి సరఫరాదారుల అరెస్ట్‌

డ్రగ్స్‌, గంజాయి సరఫరాదారుల అరెస్ట్‌

- Advertisement -

రూ.70 లక్షల హ్యాష్‌ ఆయిల్‌, గంజాయి స్వాధీనం

నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌ నగరంలో గుట్టుచప్పుడు కాకుండా హ్యాష్‌ ఆయిల్‌, గంజాయిని సరఫరా చేస్తున్న ముఠాలోని ఐదుగురిని (హెచ్‌న్యూ) హైదరాబాద్‌ నార్కొటెక్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ టీమ్‌ అదుపులోకి తీసుకుంది. లంగర్‌హౌజ్‌ పోలీసులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి నిందితుల నుంచి రూ.70లక్షల హ్యాష్‌ ఆయిల్‌, ఐదు కిలోల గంజాయి, వాహనంతోపాటు ఐదు సెల్‌ఫోన్లు తదితర వాటిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని సీసీఎస్‌లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ జివి.రఘునాథ్‌ వివరాలు వెల్లడించారు. ఒడిషాకు చెందిన పౌల్‌ ఖాలీ, ఏపీ శ్రీకాకుళానికి చెందిన క్రుషాన్‌ జెల్లా, చైతన్య, హైదరాబాద్‌ మాదాపూర్‌లో నివాసముంటున్న వైకుంఠరావు, రంగారెడ్డి జిల్లాకు చెందిన బాలాజీని అరెస్టు చేశారు.

శ్రీకాకుళానికి చెందిన వైకుంఠరావు 2008 ఆర్మీలో చేరాడు. కార్మికునిగా, డ్రైవర్‌గా చెన్నరుతోపాటు పలు ప్రాంతాల్లో పనిచేశాడు. 2015లో హైదరాబాద్‌ యూనిట్‌లో పనిచేశాడు. రిటైర్డ్‌ అయిన తర్వాత 2019లో శ్రీకాకుళంలో వ్యవసాయం చేశాడు. ఆ తర్వాత హైదరాబాద్‌కు మకాం మార్చి కారు డ్రైవర్‌గా చేశాడు. అయితే కోవిడ్‌లో అతని ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. సులువుగా డబ్బులు సంపాదించాలని నగరంలో ఒక ముఠాను ఏర్పాటు చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా ఒడిషా నుంచి గంజాయిని తీసుకొచ్చి నగరంలో సరఫరా చేస్తున్నాడు. గంజాయిపై పోలీసుల నిఘా అధికం కావడంతో హాష్‌ ఆయిల్‌ను సరఫరా చేయడం ప్రారంభించాడు. 2020లో పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లొచ్చాడు. జైలు నుంచి బయటకు వచ్చిన నిందితుడు బాలాజీ, చైతన్యతో కలిసి గంజాయి, హాష్‌ ఆయిల్‌ను చిన్నచిన్న ప్యాకెట్లుగా చేసి సరఫరా చేయడం మొదలుపెట్టారు. సమాచారం అందుకున్న నార్కొటెక్‌ బృందాలు ఈ ముఠాగుట్టును రట్టుచేశాయి. ఐదుగురిని అరెస్టు చేశాయి. ఈ సమావేశంలో సీఐ డ్యానియేల్‌, ఎస్‌ఐ వెంకటరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -