Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్యకు ఘన నివాళులు

కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్యకు ఘన నివాళులు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
కమ్యూనిస్టు నాయకుడు ,తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, కామ్రేడ్ పుచ్చల పల్లి సుందరయ్య వర్ధంతి సందర్బంగా సోమవారం బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ బుసిరెడ్డి పాండన్న ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బుసిరెడ్డి మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమర యోధుడు కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన సుందరయ్య తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ప్రముఖుడు. కులవ్యవస్థను నిరసించిన మహనీయుడని అన్నారు. నిరాడంబరతతో ఆదర్శ జీవితం గడిపారని, స్వాతంత్ర్య సమరంలోని అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. పార్లమెంటు సభ్యునిగా సుదీర్ఘ కాలం పనిచేశాడు. ఆ సమయంలో పార్లమెంటుకు కూడా సైకిల్ మీద వెళ్ళేవారు. అలాంటి మహా నాయకునికి నియోజకవర్గం ప్రజలు తరుపున ఘన నివాళులు అర్పిస్తున్నామన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -