Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇప్పలపల్లి చూపు చినమల్లు వైపు.!

ఇప్పలపల్లి చూపు చినమల్లు వైపు.!

- Advertisement -

విజయపథంలో దూసుకుపోతున్న కోడారి మల్లన్న..
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని ఇప్పలపల్లి గ్రామ ప్రజలంతా చినమల్లు వైపు చూస్తున్నారు. తమ గ్రామంలో పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలతో తలలో నాలుకలా చిన్న, పెద్ద తేడాలేకుండా జనంతో మమేకమై కలుపుగోలుగా ఉంటున్నట్లుగా చెబుతున్నారు. యాదవ కులానికి పెద్దదిక్కుగా దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న మల్లన్నకు ప్రజలతో చక్కటి అనుబంధం ఉండడంతో మా మల్లన్నను ఈసారి గ్రామ ప్రథమ పౌరుడుగా గెలిపించుకుంటామని ప్రజలు చినమల్లు వైపు మొగ్గడంతో ఇక మల్లన్న విజయం ఖాయమైనట్లే గ్రామంలో చర్చనీయంగా మారింది. తన ఉంగరం గుర్తుపై ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే అన్నివర్గాల ప్రజలకు ఒక నాయకుడిలా కాకుండా ఒక గొర్రెల కాపారిలా, ప్రజల సేవకుడిలా సేవలందిస్తానని ఇప్పలపల్లి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న  కోడారి చినమల్లయ్య యాదవ్ అన్నారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామ,ప్రజా సమస్యల పరిస్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -