Sunday, January 11, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపసర్పంచ్‌ కు ఘన సన్మానం

ఉపసర్పంచ్‌ కు ఘన సన్మానం

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం మంతపురి గ్రామానికి చెందిన దంతూరి స్వామి ఉపసర్పంచ్ గా ఎన్నికైన సందర్భంగా గ్రామ మిత్రులు,గ్రామ ప్రజలు శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ దంతూరి స్వామి మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు నోముల చందు, పేరపు స్వామి, కొరుటూరి ఉపేందర్, పల్లె బాలరాజు, సిద్ధులు, రవి, మహేందర్‌తో పాటు గ్రామ ప్రజలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -