నవతెలంగాణ-అశ్వారావుపేట: నందిపాడు పంచాయతీని సీపీఐ(ఎం) తిరిగి కైవసం చేసుకుంది. సీపీఐ(ఎం) అభ్యర్ధి కూరం దుర్గమ్మ.. ప్రత్యర్ధి బీఆర్ఎస్ అభ్యర్ధి గొంది అలివేణి పై 399 ఓట్లు ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. ఈ పంచాయితీలో మొత్తం 1189 ఓట్లుకు గాను 1087 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 26 ఓట్లు చెల్లుబాటు కాలేదు. మిగిలిన 1061 ఓట్లుకు గాను కూరం దుర్గమ్మకు 705, గొంది అలివేణికి 356 ఓట్లు వచ్చాయి. సీపీఐ(ఎం) బలపరిచిన అభ్యర్ధి కూరం దుర్గమ్మ బీఆర్ఎస్ అభ్యర్ధిపై 399 ఓట్లు ఆధిక్యంతో విజయం సాధించింది.
ఇందులో 10 వార్డులకు గాను సీపీఐ(ఎం) 6,సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ 2,కాంగ్రెస్ 2 వార్డులు కైవసం చేసుకున్నాయి.
ఈ విజయంలో వామపక్ష భావజాలం స్నేహ హస్తం,సీపీఐ(ఎం),సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య,గోకినపల్లి ప్రభాకర్‌ల దౌత్యం సత్ఫలితాన్నిచ్చింది. ఇరుపార్టీల నాయకులు,కార్యకర్తలు ప్రతీ ఒక్కరు ఐక్యంగా పనిచేయడంతో విజయం సునాయాసం అయింది. దీంతో దుర్గమ్మ సర్పంచ్ గాను, తుట్టి వీరభద్రం ఉపసర్పంచ్ గాను ఎన్నికయ్యారు.



