జిల్లాలో ఇల్లంతకుంట తంగళ్ళపల్లి బోయినపల్లి మండలాల్లో రెండో విడత ఎన్నికలు
మూడు మండలాల్లో 1,05,305 మంది ఓటర్లు ఉండగా 88553 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు
ప్రశాంతంగా ముగిసిన రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికల పోరు ప్రశాంతంగా ముగిసింది ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రెండో విడతలో మూడు మండలాలు 77 గ్రామపంచాయతీలు, 530 వార్డులకు పోలింగ్ కౌంటింగ్ ఉత్సాహంగా ఉత్కంఠగా సాగింది. ఇల్లంతకుంట బోయినపల్లి తంగళ్ళపల్లి మండలాల్లో రెండో విడత ఎన్నికలు జరిగాయి ఆదివారం ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కొనసాగింది ప్రతి పల్లెలోనూ చివరి వరకు ఎంత ఉత్సాహంగా ఓట్లు వేయడానికి తరలివచ్చారు అత్యధికంగా రెండో విడతలో 84.41 శాతం ఓటింగ్ జరిగింది.
పోలింగ్ ముగిసిన గంట తర్వాత కౌంటింగ్ ప్రారంభించారు పోలింగ్ కేంద్రాల వద్ద పార్టీలకు ప్రమేయం లేకుండా తమకు అనుకూలమైన వ్యక్తుల కోసం ప్రచారం నిర్వహించారు. పల్లెల్లో ఎదురు చూసిన ఎన్నికల సందడి గెలుపు చర్చలు వినిపించాయి రెండవ విడత పంచాయతీ ఎన్నికలను కలెక్టర్ గరీమా అగ్రవాల్ తో పాటు ఎస్పీ మహేష్ బిగితే, అదనపు కలెక్టర్ నగేష్ అదనపు ఎస్పీ చంద్రయ్య ఎన్నికల పరిశీలకులు పోలింగ్ కౌంటింగ్ లను పర్యవేక్షించారు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల నుంచి సౌకర్యాలపై ఆరా తీశారు.
మూడు మండలాల్లో పోలైన ఓట్లు 88,553…
జిల్లాలో రెండవ విడతలో ఇల్లంతకుంట బోయినపల్లి తంగళ్ళపల్లి మండలాల్లో 77 గ్రామపంచాయతీలు, 530 వార్డుల్లో జరిగిన పోలింగ్ లో 88,553 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.1,11,148 మంది ఓటర్లు ఉండగా 84.41 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు మూడు మండలాల్లో మొత్తం పోలింగ్ లో ఇల్లంతకుంట మండలంలోని 30,584 మంది ఓటు హక్కు వినియోగించుకోగా బోయినపల్లి మండలం లోని 25858 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే తంగళ్ళపల్లి మండలంలోని 32111 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు..
రెండో విడత 77 గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు మూడు మండలాల్లోని 77 గ్రామాల్లో 700 మంది పోలీస్ సిబ్బందిని ఎన్నికల నిర్వహణకు ఉపయోగించారు ఎస్పీ మహేష్ బిగితే అదనపు ఎస్పీ చంద్రయ్య డిఎస్పి నాగేంద్ర చారి ల పర్యవేక్షణలో సిఐ లు ఎస్ఐలతో పాటు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టారు సమస్యాత్మక సున్నితమైన గ్రామాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థుల తరఫున గెలుపు కోసం వారి అనుచరులు ప్రచారం నిర్వహిస్తుండగా పోలీసులు వెళ్లగొట్టడం వంటి సంఘటనలు చేసుకున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు వృద్ధులను స్వయంగా వీల్ చైర్ లో తీసుకువెళ్లి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కల్పించారు గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.


