Tuesday, December 16, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంసీపీఐ(ఎం)అభ్యర్థులను గెలిపించండి

సీపీఐ(ఎం)అభ్యర్థులను గెలిపించండి

- Advertisement -

ఎర్రజెండాతోనే సమస్యలు పరిష్కారం : పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
యాచారం, మంచాల మండలాల్లో అభ్యర్థుల తరఫున ప్రచారం


నవతెలంగాణ-యాచారం, మంచాల
ప్రజా సమస్యలపై ప్రశ్నించే సీపీఐ(ఎం) సర్పంచ్‌ అభ్యర్థులను ఎన్నికల్లో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చారు. ఎర్రజెండాతోనే గ్రామాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా యాచారం, మంచాల మండలాల్లో జాన్‌వెస్లీ పర్యటించి, పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. యాచారం మండల పరిధిలోని చిన్నతుండ్లలో పార్టీ సర్పంచ్‌ అభ్యర్థి సామర్ది జగన్‌ను గెలిపించాలని ర్యాలీ నిర్వహించారు. వాలీబాల్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో పార్టీ అభ్యర్థి సపావత్‌ లలిత పాండు బ్యాట్‌ గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడారు.

గతంలో దున్నేవాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి నశించాలని, పేదలకు బంజారు భూములు పంచాలని, కూలి రేట్లు పెంచాలని సీపీఐ(ఎం) నాయకత్వంలో అనేక పోరాటాలు జరిగాయని అన్నారు. నిరంతరం ప్రజల్లో ఉండి, ప్రజా సమస్యలపై పోరాడేది ఎర్రజెండా మాత్రమే అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేసిన మస్కు నరసింహ కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.సామెల్‌, జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి శ్రీనివాస్‌రెడ్డి, మంచాల మండల కార్యదర్శి వర్గ సభ్యులు మార బుగ్గ రాములు, సీనియర్‌ లాయర్‌ అరుణ్‌కుమార్‌, పార్టీ యాచారం మండల కమిటీ సభ్యుడు ఎం.జె వినోద్‌ కుమార్‌, పార్టీ శాఖ కార్యదర్శులు మహేందర్‌, భగత్‌, నాయకులు విజయ్ కుమార్‌, మాజీ సర్పంచులు ఆకుల భిక్షపతి, మస్కు పద్మజా, మస్కు అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -