- Advertisement -
ఇద్దరికి గాయాలు
నవతెలంగాణ – తిమ్మాజిపేట
ఇరువర్గాల ఘర్షణ ఇద్దరికీ గాయాలైన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని అవంచలో చోటుచేసుకుంది. గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున బీఆర్‌ఎస్ లోని రెండు గ్రూపుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. బీఆర్‌ఎస్ లోని రెండు గ్రూపుల్లో ఒక గ్రూపు తెల్లవారుజామున డబ్బులు పంచుతున్నారన్న సమాచారంతో రెబల్ అభ్యర్థి తరపున కార్యకర్తలు నాయకులు గొడవకు దిగారు. మాట మాట పెరగడంతో గొడవకు దారితీసింది. మాజీ సర్పంచ్ ఉషాన్న, అభ్యర్థి అభ్యర్థి కుమారుడు తరుణ్ కు గాయాలయ్యాయి ఈ సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
- Advertisement -



