Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్పంచ్ గా జంబులయ్యను గెలిపించండి

సర్పంచ్ గా జంబులయ్యను గెలిపించండి

- Advertisement -

సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యం.డి. జబ్బార్
నవతెలంగాణ – వనపర్తి 

చైతన్యవంతమైన తెల్లరాళ్లపల్లి గ్రామస్తులు, కాంగ్రెస్, బి ఆర్ ఎస్, సీపీఐ(ఎం) కార్యకర్తలు సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న జంబులయ్యను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి. జబ్బార్ ఓటర్లను కోరారు. పాన్గల్ మండలం తెల్లరాళ్లపల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్, టిఆర్ఎస్, సీపీఐ(ఎం) పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జంబులయ్యను సర్పంచ్ గా గెలిపించాలని కోరుతూ గ్రామంలోని వీధుల గుండా ప్రదర్శన నిర్వహించారు.

 ఈ సందర్భంగా సర్పంచ్ గా జంబులయ్యని గెలిపించాలని, ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని, అన్ని వార్డులను గెలిపించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ దగ్గర జరిగిన సభను ఉద్దేశించి యం. డి జబ్బార్ మాట్లాడుతూ.. జమ్ములయ్య గత 20 సంవత్సరాల నుండి తెలరాళ్లపల్లి గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరిగిందన్నారు. కమ్యూనిస్టుగా ఉంటూ నీతిగా, నిజాయితీగా పేద ప్రజల పక్షాన నిలవడి పనిచేస్తున్నారని తెలిపారు. అనేక రకాల ప్రజా పోరాటాలలో పాలుపంచుకున్న వ్యక్తి అని, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, ప్రజా సమస్యల పరిష్కార కోసం నిరంతరం పరితపించే వ్యక్తిగా ఉన్న జంబులయ్యకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మద్దతు ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రజాదరణ కలిగిన జములయ్యకు ప్రజలందరూ ఉంగరం గుర్తుపై ఓట్లు వేసి, వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. వార్డు సభ్యులందరినీ గెలిపించి గ్రామానికి మరింత సేవ చేసే అవకాశం కల్పించాలని జబ్బార్  పిలుపునిచ్చారు.    

 ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పానుగల్లు మండల మాజీ కార్యదర్శి జి.దేవేందర్, కాంగ్రెస్, బిఆర్ఎస్, సీపీఐ(ఎం) పార్టీలు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి జంబులయ్య, కాంగ్రెస్ నాయకులు విష్ణు, నారాయణ, శ్రీనివాసులు, సాయిబాబా, భాస్కర్, హనుమంతు, కేశవులు, శేఖర్, టిఆర్ఎస్ నాయకులు వీర శేఖర్, రంగసామి, నాగరాజు, సీపీఐ(ఎం) నాయకులు భీమయ్య, సాయిలు, కృష్ణయ్యతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -