- Advertisement -
రాష్ట్ర ఎన్నికల సంఘం వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
బుధవారం జరగనున్న మూడో విడత సర్పంచ్ ఎన్నికలకు ప్రజలు సహకరించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సోమవారం సాయంత్రం 5గంటల నుంచి గురువారం ఉదయం 10 గంటల వరకు నిషేదాజ్ఞలు అమల్లో ఉంటాయని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడటం, పోలింగ్, లెక్కింపు కేంద్రాల్లో ముగ్గురు అంతకన్నా ఎక్కువ మంది ఉండటం నిషేదమని పేర్కొంది. బీఎన్‌ఎస్‌ఎస్ 163 ప్రకారం ఊరేగింపులు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదని తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
- Advertisement -



