నవతెలంగాణ – కంఠేశ్వర్
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి ని మంగళవారం ఉదయం టీయూడబ్ల్యూజె(ఐజేయు) తరపున మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యల గురించి ప్రస్తావించడం జరిగింది. జర్నలిస్టుల దీర్ఘకాల సమస్య అయిన ఇండ్ల స్థలాల అంశాన్ని సుదర్శన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన సానుకూలంగా స్పందించారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వెంటనే ఆర్డీవో తో పోన్లో మాట్లాడి జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం భూ సేకరణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టి యు డబ్ల్యూ జే ఐ జేయు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, యూనియన్ నాయకులు, జర్నలిస్టులు బొబ్బిలి నరసయ్య, రామకృష్ణ, శేఖర్, గోవిందరాజు, గంగా దాస్, ప్రసాద్, ధనుంజయ్, ప్రకాష్, మండే మోహన్, గంగ ప్రసాద్, నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.



