నవతెలంగాణ-హైదరాబాద్: ఉపాధి హామీ స్కీమ్ పేరు మారుస్తూ బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో మహాత్మా గాంధీ రూరల్ గ్యారంటీ ఉపాధి హామీ పథకాన్ని(MGNREGA)..వికసిత్ భారత్ రోజ్‌గార్ అజీవిక మిషన్ (గ్రామీణ) బిల్లు-2025 VB-G RAM-G అని పేరు మారుస్తూ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర నిర్ణయాన్ని కాంగ్రెస్ తో పాటు విపక్షాలు తప్పుపట్టాయి. అధికార బలంతో బీజేపీ మితిమీరి వ్యవహరిస్తుందని విపక్షాలు మండిపడ్డాయి. మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. బిజెపి-ఆర్ఎస్ఎస్ “హక్కుల ఆధారిత సంక్షేమాన్ని నిర్వీర్యం చేసి” దానిని కేంద్రం నుండి నియంత్రించబడే దాతృత్వ కార్యక్రమాలతో భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. గాంధీ ఆనవాళ్లను, ఆయన పేరును శాశ్వతంగా తుడిచివేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.
ఉపాధి హామీ పేరు మార్పు..దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -



