Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఅశ్వారావుపేట తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ బదిలీ

అశ్వారావుపేట తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్ బదిలీ

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
సాదారణ పరిపాలనా పరం అయిన రెవిన్యూ శాఖలోని తహశీల్దార్ బదిలీలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నతాధికారులు చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జిల్లాలోని 15 మంది తహశీల్దార్ లకు ఆదివారం స్థానభ్రంశం కల్పించారు. ఈ నేపద్యంలో అశ్వారావుపేట తహశీల్దార్ గా పనిచేస్తున్న క్రిష్ణ ప్రసాద్ ఈ జిల్లాలోనే సుజాత నగర్ కు బదిలీ అయ్యారు.ఈ క్రమంలో ఆయన సోమవారం డీ.టీ రామక్రిష్ణ కు ఇంచార్జీ ఇచ్చి తను రిలీవ్ అయ్యారు. 2023 శాసనసభ సార్వత్రిక ఎన్నికలు సమయంలో ఆగస్ట్ 14 న అశ్వారావుపేట తహశీల్దార్ గా అశ్వారావుపేట బదిలీ పై వచ్చారు. పార్లమెంట్ ఎన్నికలు బదిలీల్లో భూర్గంపాడు బదిలీ అయినప్పటికీ పరిపాలనా పరంగా అధికార ప్రతిపక్షాలను సమన్వయం చేయడం,సామాన్య ప్రజానీకం తో మమేకం కావడంతో నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట కు క్రిష్ణ ప్రసాద్ సేవలు రీత్యా వారం రోజుల గడువు లోనే తిరిగి అశ్వారావుపేట తహశీల్దార్ గా తిరిగి విధుల్లో చేరారు.నేటి బదిలీల్లో సుజాత నగర్ కు వెళ్ళారు. జయశంకర్ భూపాలపల్లి నుండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కు కేటాయించబడిన ఎల్.వీరభద్రం అశ్వారావుపేట తహశీల్దార్ గా రానున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img