Wednesday, December 17, 2025
E-PAPER
Homeజిల్లాలుచిమ్మచీకటిలో పోలింగ్ కేంద్రం

చిమ్మచీకటిలో పోలింగ్ కేంద్రం

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల

ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు మూడవ వార్డు పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సమయంలో తీవ్ర అవ్యవస్థ నెలకొంది. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కేంద్రంలో చిమ్మచీకటి ఏర్పడి సుమారు అరగంట పాటు అదే పరిస్థితి కొనసాగింది. చిమ్మచీకట్లో ఓటు ఎలా వేయాలని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్నికలు మొదలై గంట గడిచినా కూడా అధికారులు విద్యుత్ సదుపాయం ఏర్పాటు చేయకపోవడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది. చివరకు వార్డు ఏజెంట్ తన ఇంటికి వెళ్లి తన సొంత లైటును తీసుకొచ్చి పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లగా, “మాకేమీ పని ఉండదా? మీ ఫోన్‌లే ఎత్తాలా?” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఎన్నికల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ప్రజల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది.

పోలింగ్ కేంద్రంలోకి ఏజెంట్, అభ్యర్థి తన సొంత లైటును తీసుకొస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. ఈ విధమైన అవ్యవస్థ ఓటర్లలో ఆందోళన కలిగించేలా ఉందని, ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -