Wednesday, December 17, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్మధ్యాహ్నం ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ తీర్పు

మధ్యాహ్నం ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్‌ తీర్పు

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ నేడు తీర్పు వెలువరించనున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్‌, అరికెపూడి గాంధీ లపై దాఖలైన పిటిషన్లపై స్పీకర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించనున్నారు. నేటి మధ్యాహ్నం 3.30 గంటలకు ఓపెన్‌ కోర్టులో తీర్పు వెలువరించనున్నారు. శాసనసభ వెబ్‌సైట్‌లో తీర్పు ప్రతులను అధికారులు అప్‌లోడ్‌ చేయనున్నారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై పలుమార్లు విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో స్పీకర్‌ తన నిర్ణయాన్ని నేడు ప్రకటించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -