- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలో బంగ్లాదేశ్ హైకమిషనర్ రియాజ్ హమీదుల్లాకు భారత్ సమన్లు జారీ చేసింది. బంగ్లాదేశ్‌లోని భారత దౌత్యాధికారులకు బెదిరింపులు వచ్చిన నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది. కానీ ఏ విధమైన బెదిరింపులు అనేది ప్రత్యేకంగా పేర్కొనలేదు. అయితే.. ఇటీవల బంగ్లాదేశ్ నాయకుడు ఒకరు ఈశాన్య రాష్ట్రాల్ని ముట్టడి చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలోనే బంగ్లాదేశ్ హైకమిషనర్‌కు సమన్లు ఇచ్చినట్లు తెలుస్తోంది.
- Advertisement -



