నవతెలంగాణ – అచ్చంపేట
నాగర్ కర్నూలు జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లాలో07 మండలాలు అచ్చంపేట, బల్మూరు, ఉప్పునుంతల, లింగాల, చారకొండ, అమ్రాబాద్, పదర లోనీ 158 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానాలకు 1064 వార్డు మెంబర్స్ లకు ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం బల్మూర్, లింగాల మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డాక్టర్.సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సందర్శించారు. ఎన్నికల జరుగుతున్న విధానాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వేచ్ఛ వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలీస్ సిబ్బంది చూసుకోవాలన్నారు. అలాగే ఓటింగ్ పూర్తి అయిన తర్వాత కౌంటింగ్ అయ్యి బ్యాలెట్ బాక్సులు డిపాజిట్ చేసే వరకు వెంబడే ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు.
మూడో విడత పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



