- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
పోలింగ్ కేంద్రాల్లో వీల్ ఛైర్లు లేకపోవడంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు, పోలీసుల ఆసరాతో ఓటు హక్కును వినియోగించుకో వాల్సిన దుస్థితి నెలకొంది. మండలంలోని తాడిచెర్ల, మల్లారం, పెద్దతూoడ్ల తోపాటు పలు గ్రామాల్లోని కేంద్రాలవద్ద అధికారులు దివ్యాంగులు, వృద్ధుల కోసం వీల్ఫైర్లు సమకూర్చలేదు. మహముత్తరం మండలంలోని పలు గ్రామాల్లో వీల్ఫైర్ లేకపోవడంతో..వృద్ధులు తమ కుటుంబసభ్యుల సహాయంతో ఓటు వేశారు. మొత్తమే నడవలేని వృద్ధులను కుటుంబ సభ్యులు ఎత్తుకెళ్ళి ఓటు వేయించారు.
- Advertisement -



