Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పోలింగ్ సిబ్బంది విధులను నిబద్ధతతో నిర్వర్తించాలి: కలెక్టర్

పోలింగ్ సిబ్బంది విధులను నిబద్ధతతో నిర్వర్తించాలి: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ శర్మ బుధవారం కాటారం మండలంలోని సుందర్ రాజుపేట, కాటారం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించిన కలెక్టర్, పోలింగ్ శాంతియుతంగా, పారదర్శకంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. పోలింగ్ సిబ్బంది విధులను నిబద్ధతతో నిర్వర్తించాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు. ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎన్నికల నియమ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

కాటారం జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్లు లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ఎలాంటి పొరపాటులకు తావు లేకుండా పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. లెక్కింపుకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భద్రతా ఏర్పాట్లు, సిబ్బంది సమన్వయం, మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో ట్రైని డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్లు, ఎంపిడిఓ, ఆర్ఓ లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -