- Advertisement -
బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు సుద్దాల రాజు
నవతెలంగాణ – దుబ్బాక
త్వరలో జరగబోవు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బహుజనులు, అణగారిన వర్గాల ప్రజలు బరిలో నిలిచి సత్తా చాటాలని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్ పీ) దుబ్బాక నియోజకవర్గ అధ్యక్షులు సుద్దాల రాజు అన్నారు. బుధవారం దుబ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇతర పార్టీలు కులాల వారీగా ఓట్లను విభజిస్తూ వారి స్వప్రయోజనాల కోసమే ఆకర్షణీయమైన పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. బహుజనులు విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయాల్లో ఎదగాలంటే అది కేవలం బీఎస్పీ తోనే అవుతుందని నొక్కి చెప్పారు. అణగారిన వర్గాల నిజమైన అభ్యున్నతి బీఎస్పీ పార్టీతోనే సాధ్యమన్నారు.
- Advertisement -



