- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
అడవిదేవులపల్లి సర్పంచ్ గా ఎన్నికైన చిన రామయ్య కు బుధవారం వికలాంగుల హక్కుల పోరాట సమితీ ఆధ్వర్యంలో సన్మానించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ గత 50 సంవత్సరాల నుండి అడవిదేవులపల్లి ప్రజలకు సుదీర్ఘ సేవలందిస్తూ ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ అడవిదేవులపల్లి అభివృద్ధిలో తన వంతు కీలక పాత్ర పోషిస్తూన్న చిన రామయ్య ను గెలిపించడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో కొట్ట ఆంజనేయులు, వెంకటయ్య, వెంకటేశ్వర్లు, ఇంతియాజ్, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



