Wednesday, December 17, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గౌరారం సర్పంచ్ హేమలత ఇమ్మడి గోపికి ఘన సన్మానం..

గౌరారం సర్పంచ్ హేమలత ఇమ్మడి గోపికి ఘన సన్మానం..

- Advertisement -

నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని గౌరారం‌ గ్రామ నూతన సర్పంచ్ గా హేమలత ఇమ్మడి గోపి ముదిరాజ్ విజయం సాధించాడంతో బుధవారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘ సభ్యులు పులమలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు సార్లు గౌరారం గ్రామ సర్పంచ్ గా గ్రామ ప్రజలు ఎన్నుకున్నారని, హేమలత ఇమ్మడి గోపి ముదిరాజ్ ఆధ్వర్యంలో గ్రామంలో ఏ సమస్య ఉన్న పరిష్కరించే విధంగా చొరవ చూపిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. హేమలత ఇమ్మడి గోపి ముదిరాజ్ హయం లో మరింత అభివృద్ధి సాధిస్తుందని వారన్నారు.

ఇదే స్ఫురితో రాబోవు రోజుల్లో ఇమ్మడి గోపి ముదిరాజ్ మరిన్ని ఉన్నత పదవులు నిర్వహించాలని మనస్పూర్తిగా కోరుతున్నాట్లు పేర్కొన్నారు. సన్మనించిన వారిలో ముదిరాజ్ సంఘ సభ్యులు మాజీ సర్పంచ్ వాచర్ మల్లయ్య, సోసైటి చైర్మన్ మొచ్చ గోపాల్,మొచ్చ గంగా సాయిలు, బుట్టి మాణిక్యం, లోకాని గోపి,దండు సయాందర్ , లోకాని గంగారాం, మొచ్చ స్వామి, అశోక్ తోపాటు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -