నవతెలంగాణ – ధూల్ పేట్
మొబైల్ ప్రపంచం అంటున్న యువతకు.. ఈతరం యువతను ఆకర్షించేల నిజాం రాజుల చరిత్ర ఉండటమే ముఖ్య కారణమని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. మంగళవారం 74వ సాలార్ జంగ్ మ్యూజియం వార్షికోత్సవాలలో ముఖ్యతిథిగా హాజరైన ఆయన వార్షికోత్సవంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎక్సిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి తరం యువత దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ పూర్వ తరాల వారు మనకిచ్చిన సంపదను పెంపొందించాలన్నారు. దేశ విదేశాల నుండి నిజం మూడు తరాల రాజుల వివరాలను వాళ్లు వాడిన వస్తువులను నేటికీ ఆకర్షించే విధంగా కాపాడి సందర్శకుల కు జ్ఞాన విజ్ఞానాన్ని తెలియజేస్తుందన్నారు.
సాలార్ జంగ్ మ్యూజియం ఆసక్తిగా దినమంతా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారంటే మూడు తరాల నిజాం రాజుల చరిత్రను గుర్తుచేశారు. గొప్పగా ఈ తరం యువతను కూడా ఆకర్షణ చేసే విధంగా చేయడమే ప్రధానమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రిన్సిపాల్ కార్యదర్శి దాన కిషోర్, అకౌంటెంట్ జనరల్ చందా పండిత్, వైస్ ఛాన్సెలర్ మొల్గారాం, సాలార్ జంగ్ మ్యూజియం బోర్డు సభ్యులు నవాబ్ అతరం అలీ ఖాన్, సాలార్ జంగ్ మ్యూజియం డైరెక్టర్ ప్రియాంక మేరీ, డాక్టర్ కుసుమ, సింగ్ తదితరులు పాల్గొన్నారు.



