– యాప్ లో యూరియా బుకింగ్
– ఆన్లైన్ బుకింగ్ పై రైతులకు అవగాహన
– ఏడీఏ పెంటేల రవి కుమార్
నవతెలంగాణ – అశ్వారావుపేట
యూరియా కోసం రైతులు పడే కష్టాలకు ప్రభుత్వం ఊరట కలిగిస్తుంది. యూరియా కోసం ఇక రైతు గంటలు తరబడి లైన్ లో నిలబడాల్సిన పనిలేకుండా, రోజులు తరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా సాంకేతిక డిజిటల్ పరిజ్ఞానంతో ఇక పై ఆన్ లైన్ లో బుకింగ్ చేసుకునే విధానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాప్ ను రూపొందించింది.దీన్ని ఈ నెల 20 వ తేదీ నుండే అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది.
ఇందుకోసం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో క్షేత్రస్థాయి వ్యవసాయ శాఖ సిబ్బందికి,అనంతరం రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు వ్యవసాయ శాఖ అదనపు సంచాలకులు పెంటేల రవికుమార్ బుధవారం తెలిపారు.
యాప్ కు సంబంధించి ఆయన తెలిపిన కొన్ని సూచనలు.
– రైతు తన మొబైల్ నూటర్ ను ఉపయోగించి (రైతు/పౌరులు) యూరియా బుకింగ్ అప్లికేషన్ లో సులభంగా లాగిన్ అవ్వవచ్చు.
– జిల్లాలోని రిటైలర్ల వారిగా అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల ప్రస్తుత స్టాక్ ను ఎవరైనా తనిఖీ చేయవచ్చు.
– యూరియా బుకింగ్ ను పూర్తి చేయడానికి పట్టా భూ యజమానులు,ఆర్ఓ ఎఫ్ఆర్ పట్టాదారులు, నాన్ – పట్టా,ఎన్.డీ.ఎస్ రైతులు, కౌలు దారులు మాత్రమే అర్హులు.
– రైతు గుర్తింపును నిర్ధారించడానికి,బుకింగ్ ను సురక్షితం చేయడానికి,రైతు పీపీబీ (పట్టా పాస్ బుక్) తో లింక్ చేయబడిన మొబైల్ సెంటర్ కు ఓటీపీ( ఒక వన్ టైమ్ పాస్ వర్డ్) పంపబడుతుంది.
– రిటైలర్లు నివేదించిన రియల్ టైమ్ స్టాక్ లభ్యత ఆధారంగా రైతులు యూరియా బ్యాగులను బుక్ చేసుకోవచ్చు.
– మీ బుకింగ్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, మీ రిఫరెన్స్ కోసం ఒక ప్రత్యేకమైన బుకింగ్ ఐడి రూపొందించ బడుతుంది.
– మీ భూమిలో నమోదు చేయబడిన సాగు విస్తీర్ణం ఆధారంగా బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న యూరియా బ్యాగుల సంఖ్య స్వయంచాలకంగా నిర్ణయించబడుతుంది.
– పంపిణీని సమర్థవంతంగా నిర్వహించడానికి, మీ సాగు విస్తీర్ణం ప్రకారం బుకింగ్ లు నిర్దిష్ట విరామాలలో బహుళ విడతలుగా (స్పెల్స్) విభజించబడ్డాయి:
– 0 నుండి 1 ఎకరం స్పెల్
– 1 నుండి 5 ఎకరాలు: 2 స్పెల్స్ (రెండు స్పెల్స్ మధ్య 15 రోజుల వ్యవధి)
– 5 నుండి 20 ఎకరాలు:
– 3 స్పెల్స్ (రెండు స్పెల్స్ మధ్య 15 రోజుల వ్యవధి)
– 20 ఎకరాల కంటే ఎక్కువ: 4 స్పెల్స్ (రెండు స్పెల్స్ మధ్య 15 రోజుల వ్యవధి)
– జిల్లాలోని ఏదైనా ఆధీకృత రిటైలర్ లేదా పీఏసీఎస్ – పాక్స్ (ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం) నుండి లుక్ చేసుకున్న యూరియాను కొనుగోలు చేసే సౌలభ్యం మీకు ఉంది.
మీరు మీ మొత్తం బుకింగ్ పరిమాణాన్ని వివిధ రిటైలర్ల నుండి పొందవచ్చు (ఉదాహరణకు, 1 ఎకరానికి 3 బ్యాగు లు కేటాయించినట్లయితే,మీరు మూడు వేర్వేరు రిటైలర్ల నుండి 3 బ్యాగులు కొనుగోలు చేయవచ్చు).
– దయచేసి గమనించండి, సాగు ట్యాబ్ లో భూమి విస్తీర్ణం నమోదు చేసిన తర్వాత దానిని మార్చడానికి వీలు లేదు.
– బుకింగ్ కేవలం 24 గంటలు మాత్రమె యాక్టివ్ గా ఉంటుంది.ఆ తర్వాత, ఉపయోగించకపోతే స్టాకు తిరిగి సిస్టమ్ లోకి విడుదల చేయడానికి బుకింగ్ ఆటోమేటిక్ గా గడువు ముగుస్తుంది.



