- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: భారత్ తొలి మిస్ ఇండియా, ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. 1964లో ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్న ఆమె, ఫ్యాషన్ కాలమిస్టుగా ఎదిగి దాదాపు 160 జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో వ్యాసాలు రాశారు. ముంబైలో జన్మించిన ఆమెకు కుమారుడు, కోడలు, కుమార్తె ఉన్నారు.
- Advertisement -



