Wednesday, December 17, 2025
E-PAPER
Homeఆదిలాబాద్ఆడెల్లి ఆలయంలో మండలి పూజ

ఆడెల్లి ఆలయంలో మండలి పూజ

- Advertisement -

హాజరైన మాజీ మంత్రి అల్లోల
నవతెలంగాణ సారంగాపూర్
మండలంలోని ప్రసిద్ధి చెందిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయంలో బుధవారం మండలి పూజ కార్యక్రమం వేదపండితులు చంద్రశేఖర్ శర్మ ఆద్వర్యంలో నిర్వహించారు. పూజ కార్యక్రమం లోమాజీ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం గణపతి పూజ, పుణ్యహవాచం, అఖండ దీపారాధన,నవ గ్రహ, అష్టోత్తర కలిశాబిషేకం, పూర్ణాహుతి, మహా ఆశీర్వచన అంతరం తీర్థ ప్రసాద్ లు అందజేశారు. అంతరం మహా అన్నదానం నిర్వహించారు.ఇటీవల నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ దండు సాయన్న ను ఈఓ.భూమయ్య శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

పారిశ్రామిక వేత్తలు అల్లోల మురళీధర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ సింగం భోజగౌడ్ ధర్మకర్తలు, గ్రామ సర్పంచ్ దండు సాయన్న, డిసిసిబి డైరెక్టర్ ఐర నాయనారెడ్డి,మాజీ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి,మాజీ ఎంపీపీ మహిపాల్ రెడ్డి,మాజీ ఆలయ చైర్మన్ ఉట్ల రాజేశ్వర్,నాయకులు ,వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -