మల్హర్ లో 83.80 శాతం పోలింగ్
నవతెలంగాణ – మల్హర్ రావు
స్థానిక ఎన్నికల్లో భాగంగా మండలంలో బుధవారం మూడవ విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతగా ముగిసింది. ఉదయం 7 నుంచి 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మండలంలో 83.80 శాంతం పోలింగ్ నమోదు అయింది. మండలంలో మొత్తం 15 సర్పంచ్ లకు గాను చిన్నతూoడ్ల, దుబ్బపేట సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 13 గ్రామాల్లో సర్పంచ్ లు,102 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.
ఇందులో కాంగ్రెస్ 12, బిఆర్ఎస్ 2,స్వతంత్య 1, విజయం సాధించారు.ఏకగ్రీవం అయిన చిన్నతూoడ్ల కాంగ్రెస్, దుబ్బపేట గా తెలిసింది. మొత్తంగా 12 సర్పంచ్ లు హస్తగతం, 2బిఆర్ఎస్ గెలుకున్నాయి. తాడిచెర్లలో 79 శాతం, మల్లారంలో 81 శాతం, పెద్దతూండ్లలో 84 శాతం, అడ్వాలపల్లిలో 88 శాతం, కొయ్యుర్ లో 85 శాతం, కొండంపేటలో 91 శాతం వళ్లెంకుంటలో 88 శాతం, రుద్రారం 84 శాతం, మల్లంపల్లిలో 94 శాతం, నాచారం 87 శాతం, ఆన్ సాన్ పల్లిలో 88 శాతం, ఇప్పలపల్లి 93 శాతం, ఎడ్లపల్లి 85 శాతం పోలింగ్ జరిగిందని ఎంపిడిఓ క్రాంతికుమార్ తెలిపారు.



