Friday, December 19, 2025
E-PAPER
Homeకరీంనగర్రాజకీయ నాయకులకు ఎస్పీ మాస్ వార్నింగ్

రాజకీయ నాయకులకు ఎస్పీ మాస్ వార్నింగ్

- Advertisement -

గంటపాటు ఇరు పార్టీల ఆందోళన
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
ఇరు పార్టీలకు 10 నిమిషాలు సమయం ఇస్తున్నా.. ఇక్కడ ఎవరూ కనిపించవద్దని ఇరు పార్టీల నేతలను జిల్లా ఎస్పీ మహేష్ బిగితే హెచ్చరించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ లపై ఈడి దాఖలు చేసిన చార్జెషీట్ ను పరిగణలోకి తీసుకోవడానికి ఢిల్లీ కోర్టు నిరాకరించిన నేపథ్యంలో బిజెపి ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేయాలని గురువారం సిరిసిల్లలోని జిల్లా బిజెపి కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నా చేస్తుండగా బిజెపి నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికి గంటపాటు ఇరు పార్టీల నేతల మధ్య వాగ్వాదం జరిగింది. డిఎస్పి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో పోలీసులు ఇరు పార్టీల నేతలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్న జిల్లా ఎస్పీ మహేష్ బిగితే వెంటనే రంగంలోకి దిగారు. ఇరు పార్టీలను పిలిచి సమస్య తీవ్రతరం దాల్చుతుందని, పది నిమిషాల్లో ఇరు పార్టీల నేతలు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. వెంటనే నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోగా పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -