- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని కిసాన్ నగర్ గ్రామ సర్పంచ్ గా గెలిచిన మొదటి రోజే గ్రామ సమస్యలపై నూతన సర్పంచ్ రామ్ రాజ్ గౌడ్ దృష్టి పెట్టారు. ఈ సందర్భంగా గురువారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలలోని సమస్యలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు. స్థానిక వార్డు మెంబర్ మోతి రామ్, ఉపాధ్యాయులు సుంకరి రాజేశ్వర్, మట్ట రమాదేవి తదితరులు ఉన్నారు.
- Advertisement -



