Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంజన్న ఆలయ టెండర్లు 51. 32 లక్షలు

అంజన్న ఆలయ టెండర్లు 51. 32 లక్షలు

- Advertisement -

– నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
– దేవాలయ ఈఓ సత్యచంద్రారెడ్డి
నవతెలంగాణ – ఊరుకొండ 

నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండ పేట శ్రీ పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయంలో గురువారం బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఆలయ టెండర్లు కొనసాగించారు. ఈ సందర్భంగా దేవాలయవో సత్యచంద్రారెడ్డి, దేవాలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, దేవాలయ సిబ్బంది తిరుపతయ్య, జలంధర్ రెడ్డి, వరలక్ష్మి, మారుతీ, శ్రీశైలం ల ఆధ్వర్యంలో దేవాలయ టెండర్లకు వేలంపాట నిర్వహించారు. వేలం పాటలో కొబ్బరికాయలు విక్రయించేందుకు శేరి వెంకటయ్య 15లక్షల 5వేలు వేలంపాట పాడి సొంతం చేసుకున్నారు. లడ్డు పులిహోర ప్రసాదం విక్రయించేందుకు శేరి వెంకటయ్య 18 లక్షల 81వేలు వేలం పాట పాడి దక్కించుకున్నారు. దేవాలయ ప్రాంగణంలో పూజ సామాగ్రి విక్రయించేందుకు వేలం పాటలు 12 లక్షల 11 వేలు వేలం పాట పాడు కొండ యాదగిరి సొంతం చేసుకున్నారు.

తలనీలాలు వేలంపాటలో సాయికిరణ్ 2లక్షల 40వేలు వేలం పాట పాడి దక్కించుకున్నారు. కొబ్బరి చిప్పలు వేలం పాటలో బాణావత్ సురేష్ 3లక్షల 5వేల 116 వేలం పాట పాడి సొంతం చేసుకున్నాడు. అంజన్న ఆలయంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని 2026 జనవరి 1 నుండి 2026 డిసెంబర్ 31 వరకు టెండర్ వేలంపాటలో సొంతం చేసుకున్న టెండర్ దారులు విక్రయాలు కొనసాగించాలని సూచించారు. టెండర్ దారులు నిబంధనలు విక్రయిస్తే శాఖమై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని ఆలయ ఈఓ సత్యచంద్రారెడ్డి హెచ్చరించారు. దేవాలయ టెండర్లలో మొత్తం 51 లక్షల 32వేల, 2వేల 116 వచ్చినట్లు దేవాలయ శాఖ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు బంగారయ్య, రమేష్, దేవాలయ సిబ్బంది, టెండర్ దారులు, ఆయా గ్రామాల భక్తులు, యాత్రికులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -