మంత్రి మహ్మద్ అజహరుద్దీన్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 20న క్రైస్తవులకు ఇవ్వనున్న క్రిస్మస్ డిన్నర్ కార్యక్రమానికి ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని క్రిస్మస్ డిన్నర్ కార్యక్రమం నిర్వహించనున్న ఎల్.బీ.స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డిన్నర్ కార్యక్రమానికి 10 వేల మంది క్రైస్తవులు హాజరు కానున్నట్టు తెలిపారు. ఎలాంటి అసౌకర్యం కలగకుండా సంబంధిత శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు చెప్పారు. ఈ సమీక్షా సమావేశంలో మైనార్టీ సంక్షేమ శాఖ బి.షఫి ఉల్లా, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మెన్ దీపక్ జాన్, వైస్ చైర్‌పర్సన్ కాంతి వెస్లీ, ఎండీ సబిత తదితరులు పాల్గొన్నారు.



