Friday, December 19, 2025
E-PAPER
Homeతాజా వార్తలురామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. దేశంలోని పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(పీఎస్సీ) ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌ వచ్చిన ద్రౌపదీ ముర్ము.. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామోజీ ఫిల్మ్‌సిటీకి చేరుకున్నారు. రాష్ట్రపతి వెంట గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, మంత్రి సీతక్క ఉన్నారు.

యూపీఎస్సీ ఛైర్మన్‌ డాక్టర్‌ అజయ్‌కుమార్‌, టీజీపీఎస్సీ ఛైర్మన్‌ బుర్రా వెంకటేశం తదితరులు సదస్సులో పాల్గొన్నారు. దేశంలో పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించనున్నారు. సదస్సు అనంతరం సాయంత్రం రామోజీ ఫిల్మ్‌సిటీలో వివిధ ప్రదేశాలను ద్రౌపదీ ముర్ము సందర్శించనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -