నవతెలంగాణ హైదరాబాద్: స్వదేశీ ఇ-కామర్స్ మార్కెట్ ప్లేస్ అయిన ఫ్లిప్కార్ట్ తమ 2025 పండుగ సీజన్ కు సంబంధించి కీలక మైలురాళ్లను ప్రకటించింది. వ్యాప్తి, వేగం, సామాజిక ప్రభావాన్ని ఇది వెల్లడించింది. దాని బలమైన లాజిస్టిక్స్ నెట్వర్క్ ద్వారా శక్తిని పొందిన బిగ్ బిలియన్ డేస్ రికార్డు వాల్యూమ్లను ఫుల్ ఫిల్ చేసింది. ఈసందర్భంగా ఫ్లిప్కార్ట్ గ్రూప్, కస్టమర్ ఎక్స్ పీరియన్స్ అండ్ రీ-కామర్స్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సపై చైన్ హెడ్ హేమంత్ బద్రి మాట్లాడుతూ… పండుగ సీజన్ స్థిరత్వం, స్థాయి అండ్ ఖచ్చితత్వానికి నిజమైనపరీక్ష అన్నారు.
తమ సరఫరా చైన్ ప్రజలు, ప్రక్రియ, సాంకేతికత విస్తృత స్థాయిలో కలిసి వచ్చినప్పుడు ఏమి సాధ్యమవుతుందో ప్రదర్శించిందన్నారు. నిమిషాల్లో పెద్ద ఉపకరణాలను డెలివరీ చేయడం నుండి దేశంలోని మారుమూల ప్రాంతాలలో డెలివరీలను ప్రారంభించడం వరకు, తమ నెట్వర్క్ ఈ క్షణానికి అనుగుణంగా నిర్మించబడిందన్నారు. ఈ సీజన్ ను ప్రత్యేకంగా ఉంచేది వేగం లేదా పరిమాణం మాత్రమే కాదు, ప్రభావం – 4 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు, విస్తృత స్థాయిలో ప్రాంతీయ అవకాశాలు, నిజమైన భారతదేశాన్ని ప్రతిబింబించే సమ్మిళిత నియామకం వంటివి వున్నాయన్నారు. సాంకేతికతను ఒక సహాయకారిగా, వ్యక్తులను కీలకంగా చేసుకుని, తాము ప్యాకేజీలను మాత్రమే కాకుండా, భారతదేశం అంతటా లక్షలాది గృహాలకు నమ్మకం, వేడుకలను అందించినందుకు గర్విస్తున్నామన్నారు.



