Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధి హామీ పేరు మార్పుతో పేదలకు తీవ్ర నష్టం

ఉపాధి హామీ పేరు మార్పుతో పేదలకు తీవ్ర నష్టం

- Advertisement -

నవతెలంగాణ కంఠేశ్వర్ 
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి చట్టం ఉపాధి హామీ పథకం గ్రామీణ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందని నిజాంబాద్ ఆర్డిఓకు సీపీఐ(ఎం) నగర కమిటీ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) నగర కార్యదర్శి సుజాత మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అనేకు దఫాలుగా సవరించి పేదలకు అందాల్సిన సంక్షేమ పథకాలకు అనేక తూట్లు పొడిచిందన్నారు. అందుట్లో భాగంగానే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని ఆర్ఎస్ఎస్ కమిషనర్ లో విబిజి రాంజీగా పేరు మారుస్తూ .. చివరికి ఉన్న పనికి కోతపెట్టే విధంగా ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు.

రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా అనేక సంవత్సరాలుగా కోతలు విధిస్తూ చివరిగా చట్టాన్ని మార్చి కొత్త పథకంలో 40% నిధులు రాష్ట్రాల భరించాలన్నడం ఈ పథకాన్ని తప్పుదారి పట్టించడమే అవుతుందన్నారు. పేదలకు అందించాల్సినటువంటి ఉపాధి హామీని వారికి అందకుండా మరింత దిగుజార్చే విధంగా ఈ పథకాన్ని కేంద్రం తీసుకొచ్చిందన్నారు. ఇప్పటికైనా బిజెపి ప్రభుత్వం పునర్ ఆలోచించాలని మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఉపాధి హామీచట్టాన్ని కొనసాగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిటీ సభ్యురాలు ఏ అనిత, పార్టీ సభ్యులు సంగీత, రజియా, యశోద, మంగళ్ బాయ్,  సారిక,  సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -