Friday, December 19, 2025
E-PAPER
Homeక్రైమ్పొరపాటున వేరే గదికి వెళ్లిన మహిళపై సామూహిక లైంగికదాడి

పొరపాటున వేరే గదికి వెళ్లిన మహిళపై సామూహిక లైంగికదాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ముంబాయిలోని ఒక హోటల్ లో మరో గది తలుపు పొరపాటున తట్టిన ఒక మహిళపై కొందరు వ్యక్తులు మద్యం మత్తులో సామూహిక లైంగికదాడికి పాల్పడినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, ఒక ప్రయివేటు ఆస్పత్రిలో పని చేసే 30 ఏళ్ల మహిళ ఛత్రపతి శంభాజీ నగర్‌లోని ఒక హోటల్‌లోని 105వ నంబర్ గదిలో ఉంటున్న ఫ్రెండ్ నుంచి డబ్బు తీసుకోవడానికి వచ్చింది. తన ఫ్రెండ్ ను కలిసిన అనంతరం గది నుంచి బయటకు వచ్చి పొరపాటున రెండో అంతస్తుకు చేరుకుంది. అయోమయానికి గురైన ఆమె తన ఫ్రెండ్ గది అని భావించి రెండో అంతస్తులోని 205 గది తలుపు తట్టింది.

ఆ గదిలో ముగ్గురు పురుషులు విందులో ఉన్నారు. తలుపు తెరిచిన ఆ ముగ్గురు మహిళను గదిలోకి లాగి బలవంతంగా బీరు తాగించి రాత్రంతా సామూహిక లైంగికడాడికి పాల్పడ్డారు. తెల్లవారుజామున మూడు, నాలుగు గంటల సమయంలో మహిళ ఆ గది నుంచి తప్పించుకుని బయటకు వచ్చింది. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ హోటల్‌కు చేరుకుని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -