Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్క్రియేటివిటీతో ఫోటోగ్రఫీ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది

క్రియేటివిటీతో ఫోటోగ్రఫీ చేస్తే భవిష్యత్తు బాగుంటుంది

- Advertisement -

– తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
క్రియేటివిటీతో ఫోటోగ్రఫీ చేస్తే భవిష్యత్తు బాగుంటుందని తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కమ్మర్ పల్లి ఫోటో వీడియో గ్రాఫర్స్ సర్వసభ్య సమావేశం మండల అధ్యక్షులు రవి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి, రాష్ట్ర సలహాదారుడు కేదార్ రెడ్డి, సౌత్ ఇండియా ఫోటో వీడియో గ్రాఫర్స్ రిప్రజెంటివ్, పూజ డిజిటల్ అధినేత రాజేష్ రెడ్డి, కమ్మర్ పల్లి ఫోటో వీడియో గ్రాఫర్  గౌరవ అధ్యక్షులు లుక్క గంగాధర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి మాట్లాడుతూ ఐక్యంగా ఉంటూ ప్రతి నెల సమావేశంఏర్పాటు చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.

ఫోటో వీడియో అధునిక రంగాలలో ఏ విధంగా రాణించాలో, కొత్త కొత్త టెక్నాలజీని తెలుసుకునేందుకు వర్క్ షాప్ లకు హాజరుకావాలని సూచించారు. కుటుంబ భరోసా పథకాన్ని ప్రతి సభ్యుడు కట్టాలన్నారు. రాష్ట్ర సలహాదారు కేదార్ రెడ్డి మాట్లాడుతూ ఫోటోగ్రఫీ రోజురోజుకు కొత్త కొత్త పద్ధతులతో, కొత్త కొత్త కెమెరాలు మార్కెట్ లో లభ్యమవుతుండడంతో  వాటికి అనుగుణంగా ఫోటోగ్రాఫర్ కూడా మారాలన్నారు. క్రియేటివిటీతో ఫోటోగ్రఫీ చేస్తే ఫోటోగ్రాఫర్ భవిష్యత్తు బాగుంటుందని సూచించారు. ఫోటోగ్రాఫర్ యొక్క భవిష్యత్తు వారి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుందని, కష్టమర్లతో మర్యాదగా వారిని ఆకట్టుకునే విధంగా ఫోటోలో నాణ్యత ఇవ్వడం వల్ల మళ్ళీ మళ్ళీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతినెలా సమావేశం ఏర్పాటు చేసుకోవడం వల్ల నూతన సాంకేతిక విధానాలను తెలుసుకోవచ్చని, ప్రతి ఫోటోగ్రాఫర్ తోటి ఫోటోగ్రాఫర్తో సమన్వయంతో ఫోటోగ్రాఫ్ చేస్తే బాగుందని తెలిపారు. అనంతరం అతిథులను  మండల ఫోటో వీడియో గ్రాఫర్స్ సభ్యులు శాలువాతో ఘనంగా సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -