Friday, December 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చేప పిల్లల విడుదల

చేప పిల్లల విడుదల

- Advertisement -

నవతెలంగాణ – బాల్కొండ 
మత్స్య అభివృద్ధి పథకం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న 100% రాయితీపై మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 2,48,360 చేప పిల్లలను శుక్రవారం అధికారులు విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి ఈ కార్యక్రమం అమలు చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మత్స్యకారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ గంగా మోహన్, ఎఫ్డిఓ దామోదర్, పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ ప్రభాకర్, మత్స్యకార సంఘం అధ్యక్షుడు బట్టు ప్రవీణ్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -