నవతెలంగాణ – కన్నాయిగూడెం
కన్నాయిగూడెం మండలంలో ఇటీవలే జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరచిన సర్పంచ్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో మండలంలోని నూతన సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను ఏటూరు నాగారం మండల కేంద్రంలోనీ బిఆర్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. గెలుపొందిన సర్పంచులందరూ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టినా గ్రామస్తులందరిని కలుపుకుని సమన్వయంతో కలసి గ్రామాభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న,కన్నాయిగూడెం మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ అప్సర్ పాషా మండల నాయకులు,ఆయా గ్రామాల వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



