నవతెలంగాణ – ఆర్మూర్
మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో నలంద పాఠశాలలో శనివారం అనుభవ పూర్వక ఆంగ్ల బోధన నైపుణ్యాలను ఒకటవ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులు నిర్వహించినారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వీచేసిన ఈ ఈ ఎల్ ఇంచార్జ్ కిషోర్ ను పాఠశాల యజమాన్యం సగర్వంగా వేదిక పైకి ఆహ్వానించడం జరిగింది. ఈ క్రమంలో ముఖ్యంశాలు ఎస్సే రైటింగు, కన్వర్జేషన్ స్కిల్స్, డిబేట్, స్టోరీ టెల్లింగ్, సింగింగ్ సాంగ్స్, స్పీచెస్, గ్రూప్ డిస్కషన్, మొదలైనవి నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకు నైపుణ్యాలను ఆంగ్ల శాస్త్ర ఉపాధ్యాయులు అనంతరావు, సరితా, సమీర్, ప్రవళిక, స్రవంతి అద్భుతమైన మెలకువలను అందించారు. తద్వారా విద్యార్థులు తమ తమ ప్రతిభను అద్భుతంగా కనబరిచారు. ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు పాఠశాల యజమాన్యం ప్రశంస పత్రాలను అందజేశారు. ఆంగ్ల శాస్త్ర ఉపాధ్యాయులకు పాఠశాల యజమాన్యం ప్రత్యేక అభినందనలు తెలిపారు.
అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రసాద్ మాట్లాడుతూ .. నేటి తరంలో విద్యార్థులకు ఇంగ్లీష్ ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు పాఠశాలలో నిర్వహించడం ఎంతో గర్వకారణమని పాఠశాల యాజమాన్యం కొనియాడారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.



